breaking news
rattamma
-
రోడ్డు ప్రమాదంలో ఆరుకి చేరిన మృతుల సంఖ్య
మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో నిన్న ముగ్గురు మృతిచెందగా.. చికిత్స పొందుతూ ఈ రోజు మరో ముగ్గురు మృతిచెందారు. దీంతో ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య ఆరుకు చేరింది. గుంటూరు జ్లిలా బొల్లపల్లి మండలం మేళ్లవాగు సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి వినుకొండ వెళ్తున్న తార్ ట్యాంకర్ ఎదురుగా వస్తున్న ప్రయాణికుల ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జు నుజ్జై డ్రైవర్ నాగరాజు అక్కడికక్కడే మృతిచెందగా.. బచ్చమ్మ, సుభాన్బీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మరో ముగ్గురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. పత్తిపాటి సుకన్య(22), రామకోటమ్మ(65), రత్తమ్మ(48) వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మృతిచెందారు. మృతులంతా తమిడిపాడుకు చెందిన వారుగా గుర్తించారు. -
విద్యుదాఘాతానికి మహిళ మృతి
బట్టలు ఆరేస్తున్న మహిళ ప్రమాద వశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది. గుంటూరు జిల్లా న్యూజెండ్ల మండలం బమిడిపాడు గ్రామానికి చెందిన రత్తమ్మ(40) ఆదివారం ఉదయం బట్టు ఆరేస్తుండగా.. ఇనుప తీగకు విద్యుత్ సరఫరా కావడంతో అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.