కాలిన గాయాలతో ఒకరి మృతి | one old women died | Sakshi
Sakshi News home page

కాలిన గాయాలతో ఒకరి మృతి

Aug 30 2016 12:39 AM | Updated on Sep 28 2018 3:41 PM

ప్రమాదవశాత్తు నిప్పంటుకొని తీవ్రంగా గాయాలపాలైన ఓ వృద్ధురాలు చికిత్సపొందుతూ సోమవారం ఎంజీఎం ఆసుపత్రిలో మృతిచెందింది.

కాజీపేట : ప్రమాదవశాత్తు నిప్పంటుకొని తీవ్రంగా గాయాలపాలైన ఓ వృద్ధురాలు చికిత్సపొందుతూ సోమవారం ఎంజీఎం ఆసుపత్రిలో మృతిచెందింది. సీఐ రమేష్‌కుమార్‌ కథనం ప్రకారం.. కాజీపేట పట్టణానికి చెందిన గున్నా లింగమ్మ(82) ఈనెల 24న పొయ్యి వద్ద కూర్చోగా ప్రమాదవశాత్తు బట్టలకు  నిప్పంటుకుంది. కుటుంబ సభ్యులు వెంటనే మంటలను ఆర్పి చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. మృతురాలి మనుమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement