ట్రాక్టర్‌ ప్రమాదంలో ఒకరి మృతి | one died in tractor accident | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ ప్రమాదంలో ఒకరి మృతి

Dec 29 2016 9:30 PM | Updated on Apr 3 2019 7:53 PM

పొలం పనుల కోసం కూలీలను తీసుకు వెళ్తున్న ట్రాక్టర్‌ గురువారం ప్రమాదానికి గురికావడంతో పక్కీరప్ప (50) మృతిచెందగా మరో ఐదుగురు గాయపడిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

మద్దికెర: పొలం పనుల కోసం కూలీలను తీసుకు వెళ్తున్న ట్రాక్టర్‌ గురువారం ప్రమాదానికి గురికావడంతో పక్కీరప్ప (50) మృతిచెందగా మరో ఐదుగురు  గాయపడిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పప్పుశనగ పంటను పీకడానికి గురువారం తెల్లవారు జామున ట్రాక్టర్‌లో 30మంది కూలీలు బయలుదేరారు. ఊరు బయటకు రాగానే కూలీలు పటుకునేందుకు ట్రాక్టర్‌కు కట్టిన తాడు తెగిపోవడంతో కిందపడ్డారు. తీవ్రంగా గాయపడిన పక్కీరప్పను గుంతకల్లు వైద్యశాలలో ప్రథమ చికిత్స అనంతరం కర్నూలు తరలించారు. అక్కడ కోలుకోలేక మృతిచెందినట్లు కుటుంబసభ్యలు తెలిపారు. మృతునికి భార్య, ఐదుగురు కూతుళ్లు, కుమారుడు వున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement