హత్య కేసు నిందితుడు ఆత్మహత్య | murder case accuse suicides | Sakshi
Sakshi News home page

హత్య కేసు నిందితుడు ఆత్మహత్య

Feb 10 2017 10:32 PM | Updated on Oct 4 2018 8:29 PM

హత్య కేసు నిందితుడు ఆత్మహత్య - Sakshi

హత్య కేసు నిందితుడు ఆత్మహత్య

పుట్లూరు మండలం బాలాపురం ఎస్సీ కాలనీలో జరిగిన లక్ష్మీదేవి హత్య కేసులో నిందితుడు పి.చింతలపల్లికి చెందిన మునిరెడ్డి శుక్రవారం విషపుగుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు.

పుట్లూరు (శింగనమల) : పుట్లూరు మండలం బాలాపురం ఎస్సీ కాలనీలో జరిగిన లక్ష్మీదేవి హత్య కేసులో నిందితుడు పి.చింతలపల్లికి చెందిన మునిరెడ్డి శుక్రవారం విషపుగుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. పరారీలో ఉన్న ఇతడి కోసం పోలీసులు సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టగా పి.చింతలపల్లి సమీపాన మృతదేహం కనిపించింది. సంఘటన స్థలాన్ని తాడిపత్రి డీఎస్పీ చిదానందరెడ్డి, రూరల్‌ సీఐ సురేంద్రనాథ్‌రెడ్డి, ఎస్‌ఐ సురేష్‌బాబు పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement