బిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి | mother died after giving birth a child | Sakshi
Sakshi News home page

బిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి

Apr 22 2017 11:26 PM | Updated on Sep 28 2018 3:41 PM

బిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి - Sakshi

బిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి

బిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి చెందిన ఘటన శనివారం పగిడ్యాలలో చోటుచేసుకుంది.

పగిడ్యాల: బిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి చెందిన ఘటన శనివారం పగిడ్యాలలో చోటుచేసుకుంది. గ్రామంలోని దేవనగర్‌ కాలనీకి చెందిన బోరెల్లి శ్రీనివాసులు భార్య మల్లేశ్వరీ(25) రెండో సారి కాన్పుకు గురువారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో సాధారణ ప్రసవంగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవానంతరం అధిక రక్తస్రావం ఏర్పడి తల్లి కోమాలోకి వెళ్లి శనివారం తెల్లవారుజామున మృత్యువాత పడింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement