నగల దుకాణంలో భారీ చోరీ | Massive theft in Vizianagaram | Sakshi
Sakshi News home page

నగల దుకాణంలో భారీ చోరీ

Apr 17 2016 6:48 PM | Updated on Sep 3 2017 10:08 PM

విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలోని మెయిన్‌రోడ్డులో ఉన్న చందన జ్యుయెలర్స్ దుకాణంలో శనివారం రాత్రి చోరీ జరిగింది.

విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఓ బంగారు దుకాణంలో భారీ చోరీ జరిగింది. పార్వతీపురం పట్టణం మెయిన్‌రోడ్డులో ఉన్న చందన జ్యుయెలర్స్ దుకాణంలో శనివారం రాత్రి చోరీ జరిగింది.

ఆదివారం సెలవు రోజు కావడంతో దుకాణాన్ని తెరిచేందుకు నిర్వాహకులు సాయంత్రం రాగా షట్టర్ తాళాలు పగులగొట్టిన విషయాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో క్లూస్‌టీమ్ రంగంలోకి దిగింది. 36 బంగారు ఉంగరాలు, ఒక నెక్లెస్, ఆంజనేయస్వామి రూపులు పోయినట్టు గుర్తించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement