కారు ఢీకొని వ్యక్తి మృతి | man dies as Car hits in eturnagaram | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని వ్యక్తి మృతి

Sep 18 2016 10:20 AM | Updated on Aug 30 2018 4:10 PM

వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి పైకి దూసుకెళ్లిన ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.

ఏటూరునాగారం(వరంగల్): వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి పైకి దూసుకెళ్లిన ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా ఏటూరు నాగారంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న బాస నర్సయ్య(40) రోడ్డు పక్కనుంచి నడుచుకుంటూ వెళ్తుండగా.. మితిమీరిన వేగంతో వచ్చిన కారు అతన్ని ఢీకొట్టింది.

దీంతో తీవ్ర గాయాలపాలైన నర్సయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement