జోరుగా 'మామ మంచు అల్లుడు కంచు' | Mama Manchu Alludu Kanchu shooting on going, says mohan babu | Sakshi
Sakshi News home page

జోరుగా 'మామ మంచు అల్లుడు కంచు'

Aug 13 2015 10:57 AM | Updated on Sep 3 2017 7:23 AM

జోరుగా 'మామ మంచు అల్లుడు కంచు'

జోరుగా 'మామ మంచు అల్లుడు కంచు'

తమ బ్యానర్లో రూపొందుతున్న 'మామ మంచు అల్లుడు కంచు' చిత్రం షూటింగ్ జోరుగా సాగుతోందని ప్రముఖ నటుడు మోహన్ బాబు తెలిపారు.

తిరుపతి : తమ బ్యానర్లో రూపొందుతున్న 'మామ మంచు అల్లుడు కంచు' చిత్రం షూటింగ్ జోరుగా సాగుతోందని ప్రముఖ నటుడు మోహన్ బాబు తెలిపారు.  ఆయన నిన్న కన్నడ నటుడు అంబరీష్, సుమలత దంపతులు, నిర్మాత రాక్లైన్ వెంకటేష్ తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

దర్శన అనంతరం మోహన్ బాబు మాట్లాడుతూ అంబరీష్తో తనకు 45 ఏళ్లుగా స్నేహం ఉందన్నారు. ఆయన కోరిక మేరకు తిరుమలకు వచ్చినట్లు చెప్పారు.  రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు సంతోషంగా ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు.

అంబరీష్ మాట్లాడుతూ జీవితంలో ఆస్తులు, డబ్బు కన్నా మంచి స్నేహితుడిని పొందటమే గొప్పన్నారు.  ప్రస్తుతం తన ఆరోగ్యం సరిగా లేదని, స్వామి ఆశీస్సులు తీసుకోవడానికి తిరుమలకు వచ్చినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement