చెట్టుపైనుంచి పడి దింపు కార్మికుడు మృతి | labour dead | Sakshi
Sakshi News home page

చెట్టుపైనుంచి పడి దింపు కార్మికుడు మృతి

Sep 19 2016 8:38 PM | Updated on Apr 3 2019 7:53 PM

కొబ్బరిచెట్టుపై నుంచి పడి దింపుకార్మికుడు మృతి చెందిన సంఘటన సోమవారం గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కె.జగన్నాథపురానికి చెందిన మోర్తా వీర వెంకట సత్యనారాయణ (48) సోమవారం శానపల్లిలంకకు చెందిన చేబ్రోలు సూర్యనారాయణ కొబ్బరి తోటలో దింపు తీసేందుకు వెళ్లాడు.

శానపల్లిలంక (అయినవిల్లి):
కొబ్బరిచెట్టుపై నుంచి పడి దింపుకార్మికుడు మృతి చెందిన సంఘటన సోమవారం గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కె.జగన్నాథపురానికి చెందిన మోర్తా వీర వెంకట సత్యనారాయణ (48) సోమవారం శానపల్లిలంకకు చెందిన  చేబ్రోలు సూర్యనారాయణ కొబ్బరి తోటలో దింపు తీసేందుకు వెళ్లాడు. కొబ్బరి చెట్టు ఎక్కి దింపుతీస్తుండగా ప్రమాదవశాత్తు  జారిపడిన వీర వెంకట సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య రమాదేవి, ముగ్గురు కుమారులు ఉన్నారు. వీఆర్వో ఎన్‌. నాగరాజు అందించిన సమాచారం మేరకు అయినవిల్లి ఎస్సై డి. దుర్గాశేఖర్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement