రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ కానుకలు | hundi record collection at tirumala | Sakshi
Sakshi News home page

రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ కానుకలు

Jun 26 2016 10:43 PM | Updated on Sep 4 2017 3:28 AM

రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ కానుకలు

రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ కానుకలు

తిరుమల శ్రీవారి ఆలయంలో రికార్డు స్థాయిలో రూ.4.22 కోట్లు హుండీ కానుకలు లభించాయి.

  •  ఆదివారం లెక్కింపుల్లో రూ.4.22 కోట్లు ఆదాయం
  •  10 గంటల్లో శ్రీవారి దర్శనం
  • తిరుమలః తిరుమల శ్రీవారి ఆలయంలో రికార్డు స్థాయిలో రూ.4.22 కోట్లు హుండీ కానుకలు లభించాయి. ఈ సీజన్‌లో ఇంతపెద్ద మొత్తంలో లభించటం ఇదే మొదటిసారి. శనివారం ఆలయ హుండీలో సమర్పించిన కానుకల్ని ఆదివారం పరకామణిలో లెక్కించారు. కొందరు భక్తులు పెద్ద మొత్తాల్లో కరెన్సీనోట్లు హుండీలో సమర్పించటంతో రికార్డు స్థాయిలో కానుకలు లభించినట్టు అధికారులు తెలిపారు. తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. సాయంత్రం 6 గంటల వరకు 6,34,847 మంది శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి 28 కంపార్ట్‌మెంట్లలోని సర్వదర్శనం భక్తులకు 10 గంటలు, కాలిబాట భక్తులకు భక్తులకు 7 గంటల సమయం తర్వాత శ్రీవారి దర్శనం లభిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement