తిరుమలలో భక్తుల రద్దీ | Heavy rush in Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ

Jan 17 2016 8:07 AM | Updated on Sep 3 2017 3:48 PM

తిరుమలలో ఆదివారం భక్తులతో కిక్కిరిపోయింది.

తిరుమలలో ఆదివారం భక్తులతో కిక్కిరిపోయింది. శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటలు... కాలినడక భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3గంటల సమయం పడుతోంది.  శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. దీంతో క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు.

క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ సిబ్బంది చర్యలు తీసుకున్నారు. అందులోభాగంగా భక్తులకు అల్పాహారంతో పాటు ఆహార పానీయాలను అందజేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement