స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు | Full preparations for Independence Day | Sakshi
Sakshi News home page

స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు

Aug 1 2016 9:07 PM | Updated on Sep 4 2017 7:22 AM

స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు

స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు

స్వాతంత్రదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని జేసీ ఏ.మహమ్మద్‌ ఇంతియాజ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

  • జేసీ ఇంతియాజ్‌
  • నెల్లూరు(పొగతోట):
    స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని జేసీ ఏ.మహమ్మద్‌ ఇంతియాజ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్‌ హాల్లో వివిధ శాఖల అ«ధికారులతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. వివిధ శాఖలకు సంబంధించి స్టాల్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. ఆత్మగౌరవం స్టాల్‌ ఏర్పాటు చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. శకటాలకు సంబంధించి డీఆర్‌డీఏ పీడీ నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తారన్నారు. వార్డులకు సంబంధించిన వివరాలు ఈనెల 10 లోపు కలెక్టరేట్‌కు అందజేయాలన్నారు. ఒక్కో శాఖ నుంచి అంకితభావంతో పని చేసిన ఇద్దరి పేర్లను మాత్రమే పంపించాలన్నారు. సమావేశంలో జేసీ–2 రాజ్‌కుమార్, ఇన్‌చార్జ్‌ డీఆర్వో మార్కండేయులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement