నలుగురు రంగారెడ్డి జిల్లా కోర్టు ఉద్యోగులు సస్పెండ్ | four ranga reddy court employees suspend by high court | Sakshi
Sakshi News home page

నలుగురు రంగారెడ్డి జిల్లా కోర్టు ఉద్యోగులు సస్పెండ్

Jun 30 2016 2:05 PM | Updated on Nov 6 2018 8:51 PM

ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు, జడ్జిలకు ఆప్షన్లు ఇవ్వటం అనే అంశంపై గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో నలుగురు రంగారెడ్డి జిల్లా కోర్టు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్: ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు, జడ్జిలకు ఆప్షన్లు ఇవ్వటం అనే అంశంపై గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో నలుగురు రంగారెడ్డి జిల్లా కోర్టు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. రంగారెడ్డి కోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి సహా.. కార్యదర్శి రంగారెడ్డి, మరో ఇద్దరు ఉద్యోగులను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఇప్పటికే 11 మంది జడ్జిలను సస్పెండ్ చేసిన అంశంలో భారీ ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్న టీ అడ్వకేట్స్ జేఏసీ తాజా సస్పెన్షన్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం ఇందిరా పార్క్ వద్ద భారీ ఎత్తున ఆందోళనకు జేఏసీ పిలుపునిచ్చింది.
 

Advertisement
 
Advertisement
Advertisement