రెండు రాష్ట్రాల బంద్‌కు మావోయిస్టుల పిలుపు | cpi maoist commitee calls bunh in AP and telangana | Sakshi
Sakshi News home page

రెండు రాష్ట్రాల బంద్‌కు మావోయిస్టుల పిలుపు

May 3 2016 12:40 PM | Updated on Aug 13 2018 7:35 PM

ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా..

ఖమ్మం: ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 4, 5 తేదీల్లో రెండు తెలుగు రాష్ట్రాల బంద్‌కు మావోయిస్టులు పిలుపు ఇచ్చారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా సీపీఐ మావోయిస్టుల కమిటీ మంగళవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ప్రజలపై, విప్లవోద్యమాలపై ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. తెలంగాణ సీఎం హిందూ పాసిస్టులతో కుమ్మక్కై భూ స్వామ్య, నల్లదొరల పాలన కొనసాగిస్తున్నారని విమర్శించింది. పోలవరం ప్రాజెక్టుల నిర్వాసిత మండలాల పీడిత ప్రజలకు అన్యాయం చేస్తున్న పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది.
 

Advertisement
 
Advertisement
Advertisement