తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ | clashes between two groups | Sakshi
Sakshi News home page

తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ

Jan 4 2016 8:51 AM | Updated on Aug 25 2018 5:38 PM

గుంటూరు జిల్లాలో టీడీపీ నేతల మధ్య ఆధిపత్యపోరుతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

రెంటచింతల: అధికార పార్టీలో లుకలుకలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా రెంటచింతల మండలం మంచికల్లు గ్రామంలో టీడీపీకి చెందిన మాజీ సొసైటీ చైర్మన్ తెనాలి వెంకటనారపురెడ్డిపై అదే గ్రామానికి చెందిన గోగుల వర్గానికి చెందిన వారు సోమవారం దాడి చేశారు. గ్రామ సెంటర్ నుంచి నడిచి వస్తున్న వెంకటనారపురెడ్డిపై కర్రలతో దాడి చేయడంతో.. అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆయన అనుచరుడైన శ్రీనివాస్ రెడ్డి పొలం వద్ద ఉన్నాడని తెలుసుకున్న వాళ్లు అక్కడికి చేరుకొని అతని పై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement