గుంటూరులో దారుణ హత్య | Brutal murder in guntur | Sakshi
Sakshi News home page

గుంటూరులో దారుణ హత్య

Feb 13 2017 10:26 AM | Updated on Aug 24 2018 2:36 PM

గుంటూరులో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు.

గుంటూరు: గుంటూరు ఆటోనగర్‌లో సోమవారం ఉదయం సాయిరెడ్డి అనే యువకుడిపై గుర్తుతెలియని దుండగులు ఒంటిపై పెట్రోలు పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడి రోడ్డుపక్కన పడిఉన్న సాయిరెడ్డిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు సాయిరెడ్డిని జీజీహెచ్‌లో చేర్పించారు. అయితే తీవ్రంగా కాలినగాయాలతో అక్కడ చికిత్సపొందుతూ సాయిరెడ్డి మృతిచెందాడు. ఘాతుకానికి పాల్పడిన దుండగులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement