బాలుడిని కాటేసిన డెంగీ | boy dies of dengue | Sakshi
Sakshi News home page

బాలుడిని కాటేసిన డెంగీ

Apr 8 2017 11:09 PM | Updated on Jul 12 2019 3:02 PM

గుంతకల్లు కథలవీధిలో నివాసముంటున్న మంజుల, రంగన్న దంపతుల కుమారుడు ధీరజ్‌(7) డెంగీ లక్షణాలతో శనివారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

గుంతకల్లు : గుంతకల్లు కథలవీధిలో నివాసముంటున్న మంజుల, రంగన్న దంపతుల కుమారుడు ధీరజ్‌(7) డెంగీ లక్షణాలతో శనివారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. స్థానికంగా గల ఓ ప్రైవేటు స్కూల్‌లో మూడో తరగతి చదివే ధీరజ్‌ మూడ్రోజుల కిందట అనారోగ్యానికి గురి కాగా, గుంతకల్లులోని ఓ ప్రైవేటు నర్సింగ్‌ హోంలో చేర్పించారు. రెండ్రోజుల పాటు వివిధ రకాల పరీక్షలు నిర్వహించిన అనంతరం బాలుడికి డెంగీ జ్వరం సోకినట్లు వైద్యులు నిర్ధరించారన్నారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలుకు తీసుకెళ్లామని కుటుంబ సభ్యులు తెలిపారు. అక్కడ తెల్లవారుజామున మరణించినట్లు వారు కన్నీరుమున్నీరయ్యారు. 

Advertisement
 
Advertisement
Advertisement