క్రీడలతో ఉల్లాసం | సూర్యాపేట : క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని రెండో అదనపు జిల్లా జడ్జి షేక్‌ రజాక్‌ ఉజ్‌ – జమ అన్నారు. | Sakshi
Sakshi News home page

క్రీడలతో ఉల్లాసం

Aug 8 2016 10:36 PM | Updated on Sep 4 2017 8:25 AM

క్రీడలతో ఉల్లాసం

క్రీడలతో ఉల్లాసం

సూర్యాపేట : క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని రెండో అదనపు జిల్లా జడ్జి షేక్‌ రజాక్‌ ఉజ్‌ – జమ అన్నారు.

సూర్యాపేట : క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని రెండో అదనపు జిల్లా జడ్జి  షేక్‌ రజాక్‌  ఉజ్‌ – జమ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం సూర్యాపేట బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక కోర్టు ఆవరణలో నిర్వహించిన క్రీడలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. న్యాయవాదులు తమ వృత్తి పరంగా ఎంతో మానసిక ఒత్తిడికి గురవుతారని, అలాంటి సమయంలో క్రీడలు మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తాయన్నారు. క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్‌ మెజిస్ట్రేట్‌ డి.నర్సింహాచార్యులు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గుడిపూరి వెంకటేశ్వర్‌రావు, న్యాయవాదులు జె.శశిధర్, నలగుంట్ల అయోధ్య, తల్లమల్ల హస్సేన్, ఎం.వెంకట్‌రెడ్డి, కె.లింగయ్య, మీలా రమేష్, రామరాజు, సుంకరబోయిన రాజు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ గ్రంధి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement