ఫేస్‌బుక్‌లో పరిచయమై.. ప్రేమగా మోసం చేసి.. | Women Protest In Front Of Husbands House | Sakshi
Sakshi News home page

ప్రేమ పేరుతో మోసం

Nov 5 2018 7:06 AM | Updated on Nov 5 2018 7:15 AM

Women Protest In Front Of Husbands House - Sakshi

భర్త ఇంటి ఎదుట ఆందోళన చేస్తున్న సరస్వతి (ఇన్‌సెట్‌లో) సిద్ధలింగప్ప

తుమకూరు : ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువకుడు ప్రేమ పేరుతో మోసం చేసాడని ఆరోపిస్తూ యువతి తల్లితండ్రులు, బంధువులతో కలసి యువకుడి ఇంటి ముందు ధర్నాకు దిగారు. జిల్లాలోని మధుగిరి తాలూకా బుళసంద్ర గ్రామానికి చెందిన సిద్దలింగప్పకు రెండేళ్ల క్రితం చన్నపట్టణకు చెందిన సరస్వతితో ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. ఇరువురికి ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారడంతో రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. అనంతరం కొద్ది కాలం బెంగళూరులో కాపురం పెట్టగా కొద్ది కాలం క్రితం యువతి గర్భం దాల్చారు. దీంతో కొద్ది రోజుల క్రితం భార్యను మధుగిరికి తీసుకువచ్చిన సిద్దలింగప్ప యువతికి అబార్షన్‌ చేయించడానికి యత్నించాడు.

అందుకు యువతి అంగీకరించకపోవడంతో తిరిగి బెంగళూరుకు వచ్చిన సిద్దలింగప్ప యువతిని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. నెల రోజులుగా భర్త కనిపించకపోవడంతో బుళసంద్ర గ్రామంలోని భర్త ఇంటి ఎదుట ఆదివారం తల్లితండ్రులు, బంధువులతో కలసి ధర్నాకు దిగారు. తమ కొడుకు కనిపించడం లేదంటూ సిద్దలింగప్ప తండ్రి దొడ్డయ్య బెంగళూరు నగరంలోని అక్కూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా సిద్దలింగప్ప మోసం చేసాడని ఆరోపిస్తూ సరస్వతి బడవనహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement