తల్లిదండ్రుల వద్దకు వెళ్దొదంటోందని.. | woman killed by husband | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రుల వద్దకు వెళ్దొదంటోందని..

Jan 26 2018 7:15 PM | Updated on Jul 30 2018 9:16 PM

సాక్షి, యలహంక : తల్లిదండ్రుల్ని చూసేందుకు వెళ్తున్న తనకు అభ్యంతరం చెప్తుండడంపై ఆగ్రహం చెందిన ఓ భర్త తన భార్యను హత్య చేశాడు. ఈ ఘటన యలహంక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. యలహంక సమీపంలోని కూడ్లులో నివాసముంటున్న ఆటో డ్రైవర్‌ శ్రీనివాస్‌, భాగ్యమ్మ (35) భార్యాభర్తలు. వీరికి 13 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. సోదరుడి వద్ద ఉన్న తల్లిదండ్రులను చూసేందుకు శ్రీనివాస్‌ తరచూ వెళ్తుండేవాడు. దీనిపై భాగ్యమ్మ అభ్యంతరం చెప్తుండేది. ఇదే విషయంలో శుక్రవారం ఇద్దరూ గొడవపడగా ఆవేశంతో భాగ్యమ్మ గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం గుండెనొప్పి వచ్చిందని ఆస్పత్రికి తరలించాడు. అనుమానం వచ్చి డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు దర్యాప్తు చేసి అసలు విషయం రాబట్టారు. తానే హత్య చేసినట్లు అంగీకరించగా నిందితుడిని అరెస్టు చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement