విషాదం: ఆడుకుంటూ చెరువులో పడి.. | Two Children Drowned To Death In Guntur | Sakshi
Sakshi News home page

విషాదం: ఆడుకుంటూ చెరువులో పడి..

Sep 2 2019 7:10 PM | Updated on Sep 2 2019 8:02 PM

Two Children Drowned To Death In Guntur - Sakshi

సాక్షి, గుంటూరు : జిల్లాలోని తెనాలిలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో పడి ఇద్దరు పిల్లలు మృతి చెందారు. ఈ సంఘటన తెనాలి ఐతానగర్‌లో సోమవారం చోటుచేసుకుంది. ఐతానగర్‌కు చెందిన రాజేష్‌(12), పండు(12) అనే ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయారు. ఇద్దరికీ ఈత రాకపోవటంతో నీళ్లలో మునిగి చనిపోయారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అప్పటి వరకు కళ్లముందు తిరుగాడిన పిల్లలు విగతజీవులుగా మారటంతో కన్నవారు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement