సునీల్‌ నారంగ్‌ సంస్థకు రూ. కోటి టోకరా | employee fraud sunil narang office jubilee hills accountant arrested cheque scam | Sakshi
Sakshi News home page

సునీల్‌ నారంగ్‌ సంస్థకు రూ. కోటి టోకరా

Apr 11 2026 9:55 AM | Updated on Apr 11 2026 9:55 AM

employee fraud sunil narang office jubilee hills accountant arrested cheque scam

హైదరాబాద్‌: ప్రముఖ సినీ నిర్మాత సునీల్‌ నారంగ్‌ కార్యాలయంలో పనిచేస్తూ దాదాపు కోటికిపైగా డబ్బు కాజేసిన ఉద్యోగిని జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు తెలిపిన మేరకు..  జూబ్లీహిల్స్‌లోని సునీల్‌ నారంగ్‌ కార్యాలయంలో వనస్థలిపురానికి చెందిన విశ్వనాథ్‌  అకౌంటెంటుగా పనిచేసేవాడు. వివిధ సంస్థలకు వారం వారం చెల్లించాల్సిన మొత్తానికి చెక్కులను అందించేవాడు. ఈ క్రమంలోనే బోగన్‌ ఖాతాలు సృష్టించి యజమానికి తెలియకుండా సరఫరాదారుకు ఇవ్వాల్సిన చెక్కుల మధ్యలో పెట్టి సంతకాలు చేయించాడు. 

దాదాపు మూడేళ్లపాటు యజమానికి తెలియకుండా ఇలా దాదాపు కోటి రూపాయల మేర మోసానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని 2024లో జరిగిన ఆడిటింగ్‌లో గుర్తించారు. దీంతో సునీల్‌ నారంగ్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా విశ్వనాథ్‌పై జూబ్లీహిల్స్‌ ఠాణాలో కేసు నమోదైంది. అప్పటి నుంచి పరారీలో ఉన్న విశ్వనాథ్‌ను జూబ్లీహిల్స్‌ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేసి రిమాండుకు తరలించారు. 

మాదాపూర్‌: ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి కొందరు లక్షల రూపాయలు వసూలు చేశారు. శుక్రవారం మాదాపూర్‌  ఇన్స్‌పెక్టర్‌ కృష్ణమోహన్‌ తెలిపిన మేరకు... జనగామాకు చెందిన మహేశ్‌ కేపీహెచ్‌బీ వద్ద ఓ సంస్థను ప్రారంభించాడు.  ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి 452 మంది నిరుద్యోగుల నుంచి రూ.80వేల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేశారు. కొద్ది రోజులు వారికి జీతాలు చెల్లించి సంస్థను మూసి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుల మేరకు పోలీసులు మహేశ్‌తోపాటు సహకరించిన  షేక్‌ నజీర్‌ భాషా, ఉదయలక్షి్మలను అరెస్ట్‌ చేశారు. మరో ఏడుగురు పరారీలోఉన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement