Road Accident in Guntur Today, News in Telugu | గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం - Sakshi
Sakshi News home page

గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం

Jul 2 2020 10:13 AM | Updated on Jul 2 2020 4:39 PM

Road Accident At Guntur - Sakshi

సాక్షి, గుంటూరు : జిల్లాలోని యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద బుధవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. విజయవాడవైపు వెళ్తన్న కారును కంటైనర్ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురులో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతులను అత్తులూరి బలరాం(25), ఫిరో అహ్మద్‌(35), వింజమూరి హరికృష్ణ(26), మేడసాని వెంకట శ్రీచందు(25)గా గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement