కత్తితో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు.. ఆపై.. | person murder married woman in prakasam district | Sakshi
Sakshi News home page

కత్తితో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు..

Mar 6 2018 7:12 PM | Updated on Aug 21 2018 6:02 PM

person murder married woman in prakasam district - Sakshi

సాక్షి, ప్రకాశం: వివాహితను కత్తితో పొడిచి చంపిన వ్యక్తి నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన జిల్లాలోని బేస్తవారిపేట మండలం ఖాజీపురం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలివి.. గ్రామానికి చెందిన నాగమణి అనే మహిళను తర్లుపాడు గ్రామానికి చెందిన శ్రీనివాసులు కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం అతను కత్తితో పాటు కంభం పోలీస్‌ స్టేషన్‌ వెళ్లి సరండర్‌ అయ్యాడు. 

అయితే నిందితుడిని బేస్తవారిపేట పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. మృతదేహం గుర్తించే పక్రియలో భాగంగా అతడ్ని పోలీసులు సంఘటన స్థలానికి తరలించారు. ఈ హత్యకు వారిద్దరి మధ్య అక్రమ సంబంధమేన కారణమని సమాచారం. మృతురాలు నాగమణిని ముగ్గురు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement