కిడ్నాప్‌ కలకలం.. టీడీపీ మంత్రి వర్గీయులే..

Person Kidnaped In Ananthapur district - Sakshi

సాక్షి, ధర్మవరం : అనంతరపురం జిల్లా ధర్మవరంలో కిడ్నాప్‌ కలకలం చోటుచేసుకుంది. ధర్మవరం ఆర్టీవో కార్యాలయం వద్ద గురువారం బళ్లారి వెంకటేశ్‌ అనే వ్యక్తిని దుండగులు కిడ్నాప్‌ చేశారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలివి.. టీడీపీ మంత్రి పరిటాల సునీత వర్గీయులే వెంకటేష్‌ను కిడ్నాప్‌ చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. కిడ్నాప్‌కు గురైన వెంకటేష్‌ పేరు మీద పది కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తి ఉందన్నారు.

గతంలో ఆస్తిని కోటి రూపాయాలకు విక్రయించాలిని టీడీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నట్లు కుటుంట సభ్యులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top