breaking news
person kidnap
-
కిడ్నాప్ కలకలం.. టీడీపీ మంత్రి వర్గీయులే..
సాక్షి, ధర్మవరం : అనంతరపురం జిల్లా ధర్మవరంలో కిడ్నాప్ కలకలం చోటుచేసుకుంది. ధర్మవరం ఆర్టీవో కార్యాలయం వద్ద గురువారం బళ్లారి వెంకటేశ్ అనే వ్యక్తిని దుండగులు కిడ్నాప్ చేశారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలివి.. టీడీపీ మంత్రి పరిటాల సునీత వర్గీయులే వెంకటేష్‌ను కిడ్నాప్ చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. కిడ్నాప్‌కు గురైన వెంకటేష్ పేరు మీద పది కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తి ఉందన్నారు. గతంలో ఆస్తిని కోటి రూపాయాలకు విక్రయించాలిని టీడీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నట్లు కుటుంట సభ్యులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
మాజీ ఎంపీపై పీఎస్ లో మహిళ ఫిర్యాదు
హైదరాబాద్ : తన భర్తను కిడ్నాప్ చేశారంటూ మాజీ ఎంపీ తులసీరామ్ పై ఓ మహిళ ఫిర్యాదుచేసింది. తన భర్తపై దాడి చేసి తులసీరామ్ బలవంతంగా తీసుకెళ్లారంటూ మైలార్‌దేవ్‌పల్లి పోలీసులను శనివారం ఓ మహిళ ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన కొద్దిసేపటికే పీఎస్‌లో కిడ్నాప్ అయినట్లు ఆరోపణలున్న వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. భూ వివాదంలో బెదిరింపులకు పాల్పడి తనతో మాజీ ఎంపీ చెక్కులు, బాండ్లపై సంతకాలు చేయించుకున్నారని ఫిర్యాదు చేశాడు.