ఉరి వేసుకొని వివాహిత ఆత్మహత్య | Married woman suicide | Sakshi
Sakshi News home page

ఉరి వేసుకొని వివాహిత ఆత్మహత్య

Mar 1 2018 9:38 AM | Updated on May 3 2018 3:20 PM

Married woman suicide - Sakshi

ఉరివేసుకున్న గీతాదేవి

చోడవరం టౌన్‌: రాజస్థాన్‌ రాష్ట్రానికి  చెందిన రాజపుత్ర గీతాదేవి(26) అనే వివాహిత బుధవారం రాత్రి ఇంటిలోని ఫ్యాన్‌కి  ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని దుడ్డువీధిలో నివాసం ఉంటున్న పద్మారాం రాజుపుత్ర  కొన్నేళ్లుగా చోడవరంలోని చీడికాడ రోడ్డులో హార్డవేర్‌ దుకాణం నిర్వహిన్నాడు.  

పద్మారాం బుధవారం రాత్రి దుకాణం మూసివేసి  ఇంటికి వెళ్లే సరికి గీతాదేవి ఇంటిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతి చెంది ఉంది.  పద్మారాం కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకుని, పోలీసులకు సమాచారం ఇచ్చారు.   ట్రైనీ ఎస్‌ఐ  హిమగిరి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ   తెలిపారు.   పద్మారాం,  గీతాదేవి మధ్య మనస్పర్థలున్నాయని, వారు  తరచూ గొడవలు పడుతున్నారని స్థానికులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement