వివాహిత ఆత్మహత్య | Married Woman Lavanya Commits Suicide In Pulivendula | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Apr 28 2018 12:29 PM | Updated on May 28 2018 1:30 PM

Married Woman Lavanya Commits Suicide In Pulivendula - Sakshi

లావణ్య మృతదేహం

పులివెందుల : పట్టణంలోని రాజారెడ్డి కాలనీకి చెందిన లావణ్య(23) అనే వివాహిత శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. లావణ్యకు మల్లికార్జునతో 8నెలల కిందట వివాహమైంది. లావణ్య పట్టణంలోని ఓ ప్రైవేట్‌ నర్సింగ్‌ హోంలో నర్సుగా విధులు నిర్వహిస్తుండేది. మల్లికార్జున ఇప్పట్ల సమీపంలోని సంచుల ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసేవాడు. గత రెండు రోజుల కిందట ముద్దనూరు వద్ద గల మంగపట్నం గ్రామంలో బంధువులు ఉండటంతో అక్కడ దేవర జరుగుతోందని ఆ కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ లావణ్య బంధువులతో కలుపుగోలుగా ఉండలేదని తల్లి మందలించింది. చిన్నప్పటి నుంచి సున్నిత మనస్తత్వం గల లావణ్య తల్లి మందలించడంతో మనస్థాపం చెంది శుక్రవారం రాజారెడ్డికాలనీలోని స్వగృహంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement