అనారోగ్యంతో వివాహిత ఆత్మహత్య | Married Woman Commits Suicide in Karnataka | Sakshi
Sakshi News home page

అనారోగ్యంతో వివాహిత ఆత్మహత్య

Mar 15 2019 1:26 PM | Updated on Mar 15 2019 1:26 PM

Married Woman Commits Suicide in Karnataka - Sakshi

అనూష మృతదేహం

మాలూరు: అనారోగ్యంతో జీవితంపై విరక్తి చెందిన వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన బుదవారం రాత్రి పట్టణంలో జరిగింది. పట్టణానికి చెందిన ఆర్‌.అనూష (26) మృతురాలు. అనూష తమిళునాడు కృష్ణగిరి జిల్లా సూళగిరి తాలూకా హదలన్‌ దోడ్డి గ్రామానికి చెందిన రాజశేఖర్, మంజుళ దంపతుల కుమార్తె. రెండు సంవత్సరాల క్రితం పట్టణంలోని ఆదర్శనగరలో రవి కుమార్‌తో  వివాహమైంది. అనూష దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. భార్యభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే అనూష ఆరోగ్యం ఈ మధ్య దెబ్బతింది. భర్త అత్తమామలు పలు ఆస్పత్రుల్లో చూపించారు. అయితే ఆరోగ్యం మెరుగు పరడక పోవడంతో విరక్తి చెందిన ఆమె బుధవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలిసిన ఆమె తల్లిదండ్రులు హుటాహుటిన చేరుకున్నారు. అనూష తల్లి పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement