ఈ నగరం నాకు వద్దు.. | Married Woman Commits Sucide | Sakshi
Sakshi News home page

ఈ నగరం నాకు వద్దు

Feb 17 2019 9:12 AM | Updated on Feb 17 2019 9:12 AM

Married Woman Commits Sucide - Sakshi

హైదరాబాదులో ఉండలేక ఓ ఇల్లాలు ఆత్మహత్య

ఉప్పల్‌: నగరంలో ఉండటానికి ఇష్టపడని ఓ ఇల్లాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ  సంఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. రామంతాపూర్‌ కేసిఆర్‌నగర్, సాయికృష్టా కాలనిలో నివాసముండే ఒరిస్సా వాసి సంతోష్‌ ఠాగూర్‌ ప్రైవేటు ఉద్యోగి.  కొంతకాలంగా నగరంలో ఉంటున్న సంతోష్‌ ఐదు నెలల క్రితం బార్య ప్రియాంక కుమారీ(27)తోపాటు వచ్చి సాయికృష్ణానగర్‌లో ఉంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం. తొమ్మిది నెలల పాప, మూడు సంవత్సరాల బాబు ఉన్నాడు.  కొన్ని రోజులుగా బార్య స్వస్థలం వెళతానని పదే పదే చెబుతున్నప్పటీకీ భర్త నిరాకరించాడు. దీంతో మనస్థాపానికి గురైన ప్రియాంక శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ప్రియాంక సోదరుడు రవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement