యువతిపై సామూహిక అత్యాచారం

Homeless 20 years Old Woman Molested By Gang At Park In Delhi - Sakshi

 న్యూఢిల్లీ : నిరాశ్రయులైన ఓ యువతిపై కామాంధులు దారుణానికి ఒడిగట్టారు. పార్క్‌లో ఒంటరిగా ఉన్న యువతిని టార్గెట్‌ చేసిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సాముహిక అ‍త్యాచారానికి  పాల్పడ్డారు. ఈ అమానుష ఘటన  దేశ రాజధాని నడిబొడ్డున చోటు చేసుకోవడం గమనార్హం. ఢిల్లీలోని ఓ పార్కులో ఆదివారం సాయంత్రం ఒంటరిగా ఉన్న ఇరవై ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడి అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో ఆ యువతి అపమారక స్థితిలోకి వెళ్లింది. అనంతరం యువతి పరిస్థితిని గమనించిన పార్క్‌లోని చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు బృందం సంఘటన స్థలానికి చేరుకొని యువతిని ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం యువతిపై అత్యాచారం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. స్పృహలోకి వచ్చిన యువతి తనపై ఇద్దరు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులకు తెలిపింది. 

ఈ సంఘటన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా.. యువతి కొన్ని రోజులుగా సారాయ్‌ కాలే ఖాన్‌ బస్‌ స్టేషన్‌ వద్దనే ఉంటుందని, అంతేగాక వీధుల్లో భిక్షాటన చేస్తూ జీవిస్తోందని తేలింది. ఈ కేసులో అనుమానితులైన ఇద్దరు వ్యక్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు యువతికి రాత్రి ఆహారాన్ని తీసుకువచ్చి అందించినట్లు, దానికి యువతి నిరాకరించడంతో అర్ధరాత్రి వరకు అక్కడే ఉండి ఆమెపై ఆత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తతం బాధితురాలిని ఎయిమ్స్‌లో చేర్పించి వైద్యం అందిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top