సూరత్‌లో రూ. 5.44 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం | Fake Notes Of Worth Rs 5.44 Lakhs Caught In Surat | Sakshi
Sakshi News home page

సూరత్‌లో రూ. 5.44 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం

Dec 21 2019 7:44 PM | Updated on Dec 21 2019 7:49 PM

Fake Notes Of Worth Rs 5.44 Lakhs Caught In Surat - Sakshi

సూరత్‌ : రూ. 5.44 లక్షల నకిలీ నోట్లను రాజస్తాన్‌ నుంచి గుజరాత్‌లోని సూరత్‌కు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పూణే పోలీసులు శనివారం సూరత్‌లో అరెస్టు చేశారు. కాగా నిందితులిద్దరూ రాజస్థాన్ నుంచి బస్సులో ప్రయాణిస్తుండగా నియోల్ చెక్ పోస్ట్ వద్ద పట్టుబడ్డారు. కాగా పట్టుబడిన వారిని చునిలాల్ సుతార్, చంద్రకాంత్ షాగా గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుల వద్ద మొత్తం 642 నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు గుర్తించారు. వీటిలో రూ. 2000,రూ. 500,రూ. 200,రూ.100 నోట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement