నిర్మాత దగ్గుబాటి సురేష్‌ బాబు కారు బీభత్సం  | Daggubati Suresh Babu Car Accident In Secunderabad | Sakshi
Sakshi News home page

నిర్మాత దగ్గుబాటి సురేష్‌ బాబు కారు బీభత్సం 

Published Mon, Oct 22 2018 10:38 AM | Last Updated on Sun, Nov 4 2018 11:33 AM

Daggubati Suresh Babu Car Accident In Secunderabad - Sakshi

సాక్షి, సికింద్రాబాద్‌ : ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్‌ బాబు కారు బీభత్సం సృష్టించింది. రాంగ్‌రూట్‌లో దూసుకెళ్లిన కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కార్ఖానా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఇంపీరియల్‌ గార్డెన్‌ వద్ద రాంగ్‌ రూట్‌లో దూసుకెళ్లిన సురేష్‌బాబుకు చెందిన టీఎస్‌09ఈఎక్స్‌2628 నెంబరు గల కారు అటుగా వెళుతున్న ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. 


దీంతో ఆ ద్విచక్రవాహనంపై వెళుతున్న దంపతులు సతీష్‌ చంద్ర(35), దుర్గ దేవి(30), సిద్దేశ్‌ చంద్ర(3)లు గాయపడ్డారు. స్థానికులు గాయపడ్డ ముగ్గురిని యశోద ఆసుపత్రికి తరలించారు. కార్ఖానా పోలీసులు ప్రమాదానికి కారణమైన దగ్గుబాటి సురేష్‌కు 41ఏ నోటీసులు ఇచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement