చోరీలకు పాల్పడుతున్న దంపతుల అరెస్ట్‌ | Couple Arrest in Gold Robbery Case Hyderabad | Sakshi
Sakshi News home page

చోరీలకు పాల్పడుతున్న దంపతుల అరెస్ట్‌

Apr 23 2019 7:11 AM | Updated on Jul 10 2019 7:55 PM

Couple Arrest in Gold Robbery Case Hyderabad - Sakshi

పోలీసుల అదుపులో నిందితులు

నాగోలు: చోరీలకు పాల్పడుతున్న భార్యాభర్తలతో పాటు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తున్న వ్యక్తితో సహా ముగ్గురిని ఎల్‌బీనగర్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేసి,  రూ.3లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఎల్‌బీనగర్‌ ఏసీపీ పృథ్వీధర్‌రావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సాయిరాజ్‌ శోభారాణి అలియాస్‌ ఉజ్వల దంపతులు నాగోలులో ఉంటూ గతకొంత కాలంగా పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నారు.

అదే ప్రాంతానికి చెందిన  గణేష్‌ కుటుంబం ఇంటికి తాళం వేసి ఫిబ్రవరి 22న ఊరికి వెళ్లినట్లు గుర్తించిన వీరు ఇంటి తాళం పగులగొట్టి 12.6గ్రాముల బంగారు నగలు చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ సొత్తును ఛత్రినాకలోని పాపిరెడ్డికి విక్రయించినట్లు తెలిపారు. ఎల్‌బీనగర్‌ డీఐ కృష్ణమోహన్, నిందితుడు ముగ్గురిని అరెస్టు చేసి వారి నుంచి 10తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకుని సోమవారం రిమాండ్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement