సుజనా చౌదరి నివాసంలో సీబీఐ సోదాలు | Cbi Rides on Sujana chowdary properties in Hyderabad | Sakshi
Sakshi News home page

సుజనా చౌదరి నివాసంలో సీబీఐ సోదాలు

Jun 1 2019 4:27 PM | Updated on Jun 1 2019 5:23 PM

Cbi Rides on Sujana chowdary properties in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కేంద్ర మాజీమంత్రి, టీడీపీ సీనియర్‌ నేత సుజనా చౌదరి నివాసంతో పాటు, కార్యాలయాల్లోనూ సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. కర్ణాటక నుంచి వచ్చిన సీబీఐ అధికారులు పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌లోని సుజనా చౌదరి కార్యాలయంలో శనివారం ఉదయం నుంచి తనిఖీలు జరుపుతున్నారు. నగరంలో మొత్తం మూడుచోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. బ్రాంకింగ్‌ ప్రాడ్‌ సెల్‌ టీమ్‌ సభ్యులు కూడా సోదాలు చేశారు. ఇందుకు సంబంధించి నలుగురు సుజనా గ్రూప్‌ డైరెక‍్టర్లను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.  శ్రీనివాస కళ్యాణ్‌రావు, వెంకట రమణారెడ్డి, సుధాకర్‌ రెడ్డి, రామకృష్ణ వర్మను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కాగా,’బెస్ట్‌ అండ్‌ కాంప్టన్’  పేరుతో మాజీ సీబీఐ డైరెక్టర్ విజయరామారావ్ కుమారుడితో కలిసి సుజనా వ్యాపారం చేశారు. కంపెనీ పేరుతో అక్రమంగా రుణాలు తీసుకోగా, గతంలోనే ఈడీతో పాటు సీబీఐ కూడా కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement
 
Advertisement
Advertisement