కేబుల్‌ ఆపరేటర్‌ ఆత్మహత్య | Cable Operator Commits Suicide Guntur | Sakshi
Sakshi News home page

కేబుల్‌ ఆపరేటర్‌ ఆత్మహత్య

Feb 18 2019 1:15 PM | Updated on Feb 18 2019 1:15 PM

Cable Operator Commits Suicide Guntur - Sakshi

గుంటూరు : ‘నాది కేబుల్‌ వ్యాపారం. కేబుల్‌లోనే ఉన్నా... కేబుల్‌తోనే పోతా... నా చావుతోనైనా ఎంఎస్‌ఓలు మారుతారని కోరుకుంటున్నా. ఓఎల్‌టీలు కొనలేం. సార్‌.. మమ్మల్ని కనిపెట్టుకోండి. ఈ పని ఇంకో ఆపరేటర్‌ చేయకుండా చూసుకోండి సార్‌. చాలా మంది కేబుల్‌ మీదే బతుకుతున్నాం. ఈ నా చావు మీకు కనువిప్పు కావాలి అని కోరుకుంటున్నాను.. నా కేబుల్‌ ఏరియాను ఎవరైనా పెద్ద మనషులు తీసుకోని నా కుటుంబానికి న్యాయం చేయండి. అమ్మా ఈ జన్మకు ఇంతే.. నన్ను అందరూ క్షమించండి’ అంటూ గుంటూరుకు చెందిన కేబుల్‌ ఆపరేటర్‌ గిరిజాశంకర్‌ పురుగు మందుతాగి ఆత్మహత్య చేసుకున్నారు. ట్రాయ్‌ నిబంధనల మేరకు సిటీ కేబుల్‌ ధరలు పెంచడంతో మనస్తాపం చెంది ప్రాణాలు తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement