వెంచర్‌లో పేలుళ్లు..ముగ్గురిపై కేసు నమోదు | blast in venture..case booked | Sakshi
Sakshi News home page

వెంచర్‌లో పేలుళ్లు..ముగ్గురిపై కేసు నమోదు

Mar 1 2018 11:44 AM | Updated on Apr 3 2019 3:52 PM

blast in venture..case booked - Sakshi

పేలుడు పదార్ధాలతో నిందితులు

శంషాబాద్‌: రాళ్లగూడ సమీపంలోని ఔటర్‌ సర్వీసు రహదారిలోని ఓ వెంచర్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా బ్లాస్టింగ్‌ (పేలుళ్లు) చేపడుతుండడంతో బుధవారం మధ్యా హ్నం ఎస్‌ఓటీ పోలీసులు దాడులు చేపట్టారు. పేలుళ్లకు పాల్పడుతున్న వెంకటేశ్వరావు(38), జంగయ్య (39)లను అరెస్ట్‌ చేసి వారి నుంచి 25 డిటోనేటర్లు, 16 జిలెటిన్‌ స్టిక్స్, కంప్రెషర్, విద్యుత్‌వైర్లు, కంప్రెషర్‌ ట్రాక్టర్‌లను స్వాధీనం చేసుకున్నారు. వెంచర్‌ యజమానిపై కూడా కేసు నమోదు చేశారు. నిందితులను ఆర్‌జీఐఏ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement