సుబ్బారెడ్డిపై దాడి; అఖిలప్రియపై అనుమానం | Attack On TDP Leader AV Subba Reddy Allegedly By Minister Akhila Priya | Sakshi
Sakshi News home page

ఏవీ సుబ్బారెడ్డిపై దాడి; అఖిలప్రియపై అనుమానం

Apr 22 2018 2:06 PM | Updated on Aug 10 2018 8:42 PM

Attack On TDP Leader AV Subba Reddy Allegedly By Minister Akhila Priya - Sakshi

మంత్రి అఖిలప్రియ, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి(పాతఫొటోలు)

సాక్షి, కర్నూలు: అధికార తెలుగుదేశం పార్టీలో వర్గ విబేధాలు భయానక దాడులకు దారితీశాయి. దివంగత భూమా నాగిరెడ్డి అనుచరుడు, టీడీపీ సీనియర్‌ నేత ఏవీ సుబ్బారెడ్డిపై ఆదివారం దాడి జరిగింది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో సైకిల్‌ యాత్ర చేస్తోన్న ఆయనపై గుర్తుతెలియని దుండగులు రాళ్లదాడి చేసి పరారయ్యారు. తనపై దాడి చేయించింది మంత్రి అఖిలప్రియే అని సుబ్బారెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. ఈ మేరకు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సర్వత్రా భయాందోళనలు: ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య చాలా కాలంగా విబేధాలు సాగుతున్న నేపథ్యంలో ఇవాళ ఒక్కసారే దాడి చోటుచేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. మంత్రి ఫొటో స్టిక్కర్లు అంటించిన వాహనంపై వచ్చిన దుండగులు.. ఏవీ సుబ్బారెడ్డి లక్ష్యంగా దాళ్లు విసరడంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా, మంత్రి అఖిలప్రియ ఆదేశాలతోనే దాడి జరిగి ఉంటుందని ఏవీ సుబ్బారెడ్డి అనుమానించారు. ఈ మేరకు ఫిర్యాదులోనూ మంత్రి పేరును ప్రస్తావించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement