అటవీ అధికారులపై దాడి.. | Attack On Forest Officers In Nalgonda District | Sakshi
Sakshi News home page

అటవీ అధికారులపై దాడి..

Jun 4 2020 8:21 AM | Updated on Jun 4 2020 8:55 AM

Attack On Forest Officers In Nalgonda District - Sakshi

సాక్షి, నల్గొండ: అటవీ రాళ్ల తరలింపును అడ్డుకున్న ఫారెస్ట్‌ అధికారులపై స్థానికులు దాడికి దిగిన ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. అడవిదేవులపల్లి మండలం ముదిమాణిక్యం పంచాయతీ పరిధిలో రెండు ట్రాక్టర్లలో అటవీ రాళ్లను తరలిస్తుండగా అటవీ అధికారులు అడ్డుకున్నారు. ట్రాక్టర్లను సీజ్‌ చేసి ఫారెస్ట్‌ కార్యాలయానికి తరలిస్తుండగా అధికారులపై సుమారు 15 మంది స్థానికులు కర్రలు,రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆరుగురు అధికారులు గాయపడ్డారు. వారిని వైద్య చికిత్స కోసం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అడవిదేవులపల్లి పోలీస్‌స్టేషన్‌లో అటవీ అధికారులు ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement