అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు | The accused has been arrested in the rape case | Sakshi
Sakshi News home page

అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు

Apr 10 2018 11:14 AM | Updated on Oct 16 2018 4:50 PM

The accused has been arrested in the rape case - Sakshi

నిందితుడి అరెస్టు చూపుతున్న సీఐ రామలింగమయ్య, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు 

పాకాల: మండలంలోని కె.వడ్డేపల్లి పంచాయతీ పోలిరెడ్డివారిపల్లిలో ఈ నెల 5వ తేదీన మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారానికి పాల్పడిన నిం దితుడిని అరెస్టు చేసినట్టు సీఐ రామలింగయ్య తెలిపారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ పోలిరెడ్డివారిపల్లి గ్రామానికి చెందిన లేట్‌ సుబ్రమణ్యం కుమారుడు హేమసుందరం(21) పక్క ఇంటి వారి పశువులకు గడ్డి వేసేందుకు వెళ్లాడని తెలిపారు.

ఆ సమయంలో అక్కడ నిస్సహాయ స్థితిలో ఉన్న మానసిక దివ్యాంగురాలి(29)పై అత్యాచారానికి ఒడిగట్టాడని చెప్పారు. బాధితురాలి వదిన దుశ్చర్యని చూసి కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడన్నారు. ఎస్‌ఐ యు.వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసుకుని దర్యా ప్తు చేపట్టారని తెలిపారు. నిందితుడు సోమవారం నేండ్రగుంట వద్ద ఉండగా అరెస్టు చేసినట్టు వివరించారు. అతన్ని కోర్టుకు హాజరుపరిచామని తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement