టాటా ఏసీ బీభత్సం.. ఏడుగురికి గాయాలు | 7 people Injured In tata ACE Accident In Vijayawada | Sakshi
Sakshi News home page

టాటా ఏసీ బీభత్సం.. ఏడుగురికి గాయాలు

Nov 21 2019 6:48 PM | Updated on Nov 21 2019 7:40 PM

7 people Injured In tata ACE Accident In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ : నగర శివారులో ఉన్న ఓ గ్రామంలో టాటా ఏసీ వాహనం బీభత్సం సృష్టించింది. దారిలో వెళ్తున్న మూడు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టి.. రోడ్డు పక్కన ఉన్న దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి గాయాలు అవ్వగా.. ఇ‍ద్దరి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో క్షతగాత్రులను 108 వాహనంలో విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement