తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | normal rush in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Jan 8 2018 9:11 AM | Updated on Jan 8 2018 9:11 AM

సాక్షి, తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దర్శనం కోసం భక్తులు 9 కంపార్ట్‌మెంట్లలో వేచిఉన్నారు. సర్వ దర్శనానికి 4 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటలు, స్వామి వారి ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది.

ఆదివారం శ్రీవారిని 68,690 మంది దర్శించుకున్నారు. 24,239 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీలో భక్తులు సమర్పించిన నగదు రూ. 2.87కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement