భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల | heay rush in tirumala | Sakshi
Sakshi News home page

భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల

Jan 15 2018 7:56 AM | Updated on Jun 2 2018 2:59 PM

సాక్షి, తిరుమల : తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం కాంప్లెక్స్‌లో భక్తులతో అన్ని కంపార్ట్‌మెంట్స్ నిండిపోయాయి. కంపార్ట్‌మెంట్ల వెలుపల భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.

ఆదివారం శ్రీవారిని 87,336 మంది భక్తులు దర్శించుకోగా, 37,780 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.49 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement