యథావిధిగానే శ్రీవారి కైంకర్యాలు | Chakrasnanam end as a celebration | Sakshi
Sakshi News home page

యథావిధిగానే శ్రీవారి కైంకర్యాలు

Dec 31 2017 1:49 AM | Updated on Dec 31 2017 1:49 AM

Chakrasnanam end as a celebration - Sakshi

సాక్షి, తిరుమల: తిరుమల ఆలయంలో నూతన సంవత్సరం 2018, జనవరి ఒకటోతేదీ సందర్భంగా శ్రీవారి పూజా కైంకర్యాలు, ఆలయ అలంకరణల్లో యథావిధిగానే నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో కొత్త సంవత్సరం వేడుకలు నిర్వహించరాదని దేవాదాయశాఖ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, రాష్ట్రాలకు అతీతంగా కొత్త సంవత్సరం తొలిరోజున వేలాది మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం తరలివస్తుంటారు. ఈసారి కూడా అదే తరహాలో వచ్చే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో ఆంగ్ల సంవత్సరం వేడుకలు అనే రీతిలో కాకుండా తరలివచ్చే శ్రీవారి భక్తులు, వారికి ఆలయ శోభ ఉట్టిపడేలా అలంకారాలు మాత్రం సాగించనున్నారు. సోమవారం వేకువజామున తొలుత ధనుర్మాసం తిరుప్పావై పారాయణం, ఇతర పూజలు చేస్తారు. కాగా వైకుంఠ ద్వాదశి పర్వదినం సందర్భంగా శనివారం శ్రీవారి చక్రస్నానం శాస్రోక్తంగా నిర్వహించారు. 

Advertisement
 
Advertisement
Advertisement