హైదరాబాద్ మార్కెట్లోకి ఎంటీఆర్ ''స్నాక్అప్'' స్నాక్స్ | mtr snacks in hyderabad snackup | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ మార్కెట్లోకి ఎంటీఆర్ ''స్నాక్అప్'' స్నాక్స్

Mar 15 2016 1:17 AM | Updated on Aug 20 2018 7:27 PM

హైదరాబాద్ మార్కెట్లోకి ఎంటీఆర్  ''స్నాక్అప్''  స్నాక్స్ - Sakshi

హైదరాబాద్ మార్కెట్లోకి ఎంటీఆర్ ''స్నాక్అప్'' స్నాక్స్

దేశీ ప్యాకేజ్డ్ ఫుడ్స్ అగ్రగామి ఎంటీఆర్ తాజాగా ‘స్నాక్‌అప్’ స్నాక్స్‌ను హైదరాబాద్ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది.

హైదరాబాద్: దేశీ ప్యాకేజ్డ్ ఫుడ్స్ అగ్రగామి ఎంటీఆర్ తాజాగా ‘స్నాక్‌అప్’ స్నాక్స్‌ను హైదరాబాద్ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఇవి 16 రుచుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. కర్నాటక మార్కెట్‌లో విజయవంతమైన స్నాక్‌అప్ శ్రేణిని ఇప్పుడు హైదరాబాద్‌లో ప్రవేశపెడుతున్నామని, ఇక్కడి ప్రజలు కూడా తమ ఉత్పత్తులను ఆదరిస్తారని ఎంటీఆర్ ఫుడ్స్ సీఈవో సంజయ్ శర్మ తెలిపారు. 180 గ్రాముల ప్యాక్ ధర రూ.60గా ఉంటుందని పేర్కొన్నారు. ‘స్నాక్‌అప్’ స్నాక్స్ దగ్గరిలోని దుకాణాల్లో, ఆధునిక ట్రేడ్ స్టోర్లలోనూ వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement