కరోనా కిట్ల రవాణాకు ఎయిరిండియా విమానాలు | Air India operating cargo flights to move medicines | Sakshi
Sakshi News home page

కరోనా కిట్ల రవాణాకు ఎయిరిండియా విమానాలు

Mar 29 2020 5:08 AM | Updated on Mar 29 2020 5:10 AM

Air India operating cargo flights to move medicines - Sakshi

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో రవాణావ్యవస్థ పూర్తిగా నిలిచిపోవడంతో కరోనా కిట్లను అత్యవసర ప్రాతిపదికన ఎయిరిండియా విమానాల ద్వారా ఆస్పత్రులకు అందిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి వెల్లడించారు. ఐసీఎంఆర్‌(ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌) రూపొందించిన కరోనా కిట్లను ఢిల్లీ నుంచి ఐజ్వాల్, కోల్‌కతా, హైదరాబాద్‌లకు ఇప్పటికే పంపాం. ముంబై నుంచి పుణే, బెంగళూరు, తిరువనంతపురంలకు .. కోల్‌కతా నుంచి దిబ్రూగర్‌కుకు పంపనున్నాం’అని ట్విట్టర్‌లో వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement