శ్రీవారి సన్నిధిలో ఎంపీ వైవీ | yv subba reddy visit to tirumala venkateswara swamy | Sakshi
Sakshi News home page

శ్రీవారి సన్నిధిలో ఎంపీ వైవీ

Nov 17 2014 1:16 AM | Updated on Nov 9 2018 6:29 PM

శ్రీవారి సన్నిధిలో ఎంపీ వైవీ - Sakshi

శ్రీవారి సన్నిధిలో ఎంపీ వైవీ

రాష్ట్రంలో వర్షాలు బాగా కురిపించి, సస్యశ్యామలం చేయాలని శ్రీవేంకటేశ్వర స్వామిని వేడుకున్నట్లు ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

సాక్షి,తిరుమల : రాష్ట్రంలో వర్షాలు బాగా కురిపించి, సస్యశ్యామలం చేయాలని శ్రీవేంకటేశ్వర స్వామిని వేడుకున్నట్లు  ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆదివారం తన మనుమడు అగస్త్య పుట్టెంట్రుకలను శ్రీవారికి సమర్పించారు. ఆయన సతీమణి స్వర్ణమ్మ, కుమారుడు విక్రాంత్‌రెడ్డి, కోడలు అపూర్వ, తమ్ముడు భద్రారెడ్డితో కలసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియూతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ప్రతి ఒక్కరూ అభివృద్ధిపథంలో నడిచేలా శ్రీవారు ఆశీస్సులు అందజేస్తారని ఆకాంక్షించారు. వారి వెంట వైఎస్‌ఆర్ సీపీ నేత తన్నీరు నాగరాజు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement