టీటీడీ భూములపై దుష్ప్రచారం మానండి | YSRCP MLA Malladi Vishnu Comments On TDP | Sakshi
Sakshi News home page

దేవుని భూములు ప్రభుత్వం పరిరక్షిస్తుంది

May 24 2020 4:01 PM | Updated on May 24 2020 4:45 PM

YSRCP MLA Malladi Vishnu Comments On TDP - Sakshi

సాక్షి, విజయవాడ: ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గం లోని వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి సీఎం సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాడు-నేడు కార్యక్రమం నిర్వహిస్తున్నామని, వచ్చేనెల 1న కొత్త 108 వాహనాలు ప్రభుత్వం ప్రారంభిస్తుందని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం భూములు పై ఎల్లో మీడియా, బీజేపీ, టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాలు సరైనది కాదని హితవు పలికారు. 2015లో చంద్రబాబు ప్రభుత్వంలో ఆస్తులు అమ్మాలని అని బోర్డు తీర్మానించిందన్నారు. ఇప్పుడు టీడీపీ గగ్గోలు పెడుతోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ పని చేస్తున్న టీడీపీ,బీజేపీ విమర్శలు చేస్తున్నాయని, ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. దేవుని భూములను రాష్ట్ర ప్రభుత్వం పరిరక్షిస్తుందని మల్లాది విష్ణు పేర్కొన్నారు.
(అప్పుడు సీబీఐ గుర్తుకు రాలేదా..?)

Advertisement
 
Advertisement
Advertisement