బైక్‌పై స్పెయిన్‌ టు అనంత | Women World Tour on Bike Spain to Anantapur | Sakshi
Sakshi News home page

బైక్‌పై స్పెయిన్‌ టు అనంత

Dec 19 2019 7:39 AM | Updated on Dec 19 2019 7:39 AM

Women World Tour on Bike Spain to Anantapur - Sakshi

మార్తా ఇన్‌ సాస్తికి స్వాగతం పలుకుతున్న అన్నే ఫెర్రర్, విశాల ఫెర్రర్‌లు

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: ఒకటి కాదు రెండు కాదు ఏకకాలంలో 20 దేశాల యాత్రకు బయలుదేరిందామె. అదీ ఏ విమానంలో కాదు. బైక్‌పై. అలా 3 నెలల క్రితం యూరప్‌ ఖండంలోని స్పెయిన్‌ దేశంలో మొదలైన ఆమె యాత్ర బుధవారం అనంతకు చేరుకుంది. మానవహక్కులను పరిరక్షించాలని కోరుతూ మేలైన ప్రపంచం కోసం తన వంతుగా యాత్ర చేపట్టానంటున్న ఆమేస్పెయిన్‌లోని మాడ్రిడ్‌ ప్రాంతానికి చెందిన మార్తా ఇన్‌ సాస్తి (55).అనంతకు వచ్చిన సందర్భంగా ఆర్డీటీ ప్రధాన కార్యాలయానికి విచ్చేసిన ఆమెకు ఘన స్వాగతం లభించింది.

ఆర్డీటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అన్నే ఫెర్రర్, హాస్పిటాలిటీ డైరెక్టర్‌ విశాల ఫెర్రర్‌లనూ ఆమె కలిశారు. ఈ సందర్భంగా మార్తా ఇన్‌ సాస్తి మాట్లాడుతూ ఇప్పటికే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌పై ఇటలీ, టర్కీ, ఇరాన్‌ మొదలైన 11 దేశాలను దాటినట్లు తెలిపారు. 12 నెలల పాటు ప్రయాణం చేయనున్నట్లు పేర్కొన్నారు. కాగా, స్పెయిన్‌కు చెందిన క్రిస్‌ ఫౌండేషన్‌ ఆర్డీటీ సంస్థతో కలిసి జిల్లాలో 10 గృహాలు, ఒక కమ్యూనిటీ హాలును నిర్మిస్తోంది. అందులో మార్తా ఒక సభ్యురాలు కావడం గమనార్హం. అన్నే ఫెర్రర్‌తో సమావేశానంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ట్లు తెలిపారు. ఆర్డీటీ సంస్థ మహిళా సాధికారత కోసం చేపడుతున్న కార్యక్రమాలను ప్రశంసించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement