చెరువులో మునిగి ఇద్దరు చిన్నారుల మృత్యువాత | two drowned and died in pond | Sakshi
Sakshi News home page

చెరువులో మునిగి ఇద్దరు చిన్నారుల మృత్యువాత

Jun 20 2015 3:26 PM | Updated on Sep 17 2018 8:02 PM

విజయనగరం జిల్లా డెంకాడ మండలం రఘుమండ గ్రామంలో శనివారం విషాదం చోటుచేసుకుంది.

డెంకాడ ( విజయనగరం) : విజయనగరం జిల్లా డెంకాడ మండలం రఘుమండ గ్రామంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు చెరువు నీటిలో మునిగి మృతి చెందారు. గ్రామస్తుల కథనం ప్రకారం... 9వ తరగతి చదివే పల్లా సునీల్, 8వ తరగతి చదువుతున్న పల్లా హరి శనివారం పశువులను తీసుకుని చెరువు సమీపంలోకి వెళ్లారు. కాగా చెరువులో నీటిపై వాలిన పక్షులను పట్టుకోవాలన్న సరదాతో లోపలికి దిగారు. ఈత రాకపోవడంతో మునిగిపోయి ప్రాణాలు వదిలారు. గ్రామస్తులు ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement